Asia Cup : ఆసియా కప్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బోర్డు పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. ముహమ్మద్ వసీం (Muhammad Waasim) సారథిగా 17 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. ముక్కోణపు సిరీస్‌కు తీసుకున్న క్రికెటర్లలో చాలామందికి మెగా టోర్నీ బెర్తు దక్కింది. అలానే సీనియర్లు మతిఉల్లాహ్ ఖాన్, లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ సిమర్జిత్ సింగ్‌లు స్క్వాడ్‌లో చోటు సంపాదించారు. వికెట్ కీపర్ ఆర్యన్ష్ శర్మకు బ్యాకప్‌గా రాహుల్ చోప్రాను తీసుకున్నారు సెలెక్టర్లు.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మొదలవ్వనుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఆతిథ్య జట్టు గ్రూప్ ఏ లో ఉంది. లీగ్ దశ తొలిపోరులో భాగంగా సెప్టెంబర్ 10న భారత జట్టుతో ముహమ్మద్ వసీం సేన తలపడనుంది. సెప్టెంబర్ 15న ఒమన్‌ను, సెప్టెంబర్ 19న పాకిస్థాన్‌ను యూఈఏ ఢీకొట్టనుంది.
UAE have named their 17-member Asia Cup squad led by Muhammad Waseem. They last featured in the tournament in 2016, when it was held in Bangladesh
🔗 Read more: https://t.co/9VV0HEVoKF pic.twitter.com/XfwYwO78Y3
— ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2025
ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్‌కు షాకిచ్చి పొట్టి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న వసీం బృందం స్వదేశంలో సంచలన విజయాలతో చెలరేగాలనే కసితో ఉంది. విధ్వంసక హిట్టర్ అయిన కెప్టెన్ వసీం, టాపార్డర్ రాణిస్తే ఈ పసికూన సూపర్ 4 కు చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు అంటున్నారు విశ్లేషకులు.
యూఏఈ స్క్వాడ్ : ముహమ్మద్ వసీం(కెప్టెన్), అలీసాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ(వికెట్ కీపర్), అసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాషర్, ఎథాన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతిఉల్లాహ్ ఖాన్, ముహమ్మద్ ఫారూఖ్, ముహమ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జొహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కపర్), రొషిద్ ఖాన్, సిమర్జిత్ సింగ్, సఘిర్ ఖాన్.