అబుదాబి : స్వదేశంలో ఆసియా కప్ ఆడుతున్న యూఏఈ తమ రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 42 పరుగులతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 20 ఓవర్లకు 172/5 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ వసీమ్ (69), అలీషాన్ (51) అర్ధశతకాలతో రాణించారు. ఛేదనలో ఒమన్ 18.4 ఓవర్లలో 130 రన్స్‌కు ఆలౌట్ అయింది. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీకి నాలుగు (4/23) వికెట్లు దక్కాయి.