వైజాగ్: ప్రో కబడ్డీ లీగ్‌లో యూ ముంబా అదరగొడుతున్నది. ఆదివారం ఆ జట్టు 36-33తో తమిళ్ తలైవాస్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. తొలి అర్ధభాగంలో 14-11తో తలైవాస్ జట్టు ఆధిక్యంలోనే ఉంది. సెకండాఫ్‌లోనూ ఆ జట్టు 28-20తో విజయం దిశగా సాగింది.
కానీ ఆఖర్లో ముంబా పుంజుకుని వరుస పాయింట్లతో తలైవాస్ ఆధిక్యాన్ని తగ్గిస్తూ గెలుపు దిశగా దూసుకొచ్చింది. చివర్లో ముంబా ప్లేయర్ అజిత్.. ఒకే రైడ్‌లో ఏకంగా ఐదు పాయింట్లు సాధించి ఆ జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు.