U-19 Women’s T20 WC | మలేషియా వేదికగా జరుగుతున్న అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్‌తో జనవరి 31న తలపడనున్నది. ఐసీసీ టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా వరుస విజయాలతో సెమీ ఫైనల్ వరకు చేరింది. ఇక కీలకమైన సెమీస్‌లోనూ నిక్కీ ప్రసాద్ నేతృత్వంలోని యువ భారత్ జోరును కొనసాగిస్తే ఫైనల్‌కు చేరుకోనున్నది. గ్రూప్ దశలో వెస్టిండిస్, మలేషియా, శ్రీలంకపై వరుస విజయాలను నమోదు చేసి సూపర్ సిక్స్‌కు చేరింది. సూపర్ సిక్స్ దశలో తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టుపై 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
సూపర్ సిక్స్ దశలో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి త్రిష గొంగడి అద్భుత బ్యాటింగ్‌తో అలరించింది. అండర్-19 టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారిగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర లిఖించింది. స్కాట్లాండ్ జట్టుపై 59 బంతుల్లోనే 10 పరుగులు చేసింది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే అజేయ సెంచరీ చేసింది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో మరో ఓపెనర్ జీ కమలినీ సైతం 42 బంతుల్లో 51 పరుగులతో రాణించింది. టోర్నీలోని ఐదు మ్యాచుల్లో త్రిష 76.66 సగటుతో 230 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌వుమెన్స్ డేవినా పెర్రిన్ 131 పరుగులతో రెండో స్థానంలో ఉంది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో భారత్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి 58 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్‌లు ఆయుషి శుక్లా ఎనిమిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల పడగొట్టింది. వైష్ణవి శర్మ ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు, గొంగడి త్రిష ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్ల చేసింది. వైష్ణవి ఇప్పటి వరకు 12 వికెట్ల పడగొట్టగా.. ఆయుషి పది వికెట్ల తీసింది.
భారత జట్టు : నిక్కీ ప్రసాద్ (కెప్టెన్), సానికా చల్కే, జీ త్రిష, జీ కమలిని, భావికా అహిరే, ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషితా వీజే, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, వైష్ణన్, ఎండీ షబ్నం.
ఇంగ్లాండ్ జట్టు : అబి నార్గ్రోవ్ నార్గ్రోవ్ (కెప్టెన్), ఫోబ్ బ్రెట్, ఒలివియా బ్రిస్డెన్, టిల్లీ కోర్టీన్ కోల్మన్, ట్రూడీ జాన్సన్, కేటీ జోన్స్, షార్లెట్ లాంబార్ట్, ఈవ్ ఓనీల్, డేవినా పెర్రిన్, జెమిమా స్పెన్స్, షార్లెట్ స్టబ్స్, అమృతా సురెన్కుమార్, ప్రిషా థానవాలా, ఎరిన్ థామస్, గ్రా థానవాలా.
Shardul Thakur: మేఘాలయాతో రంజీ మ్యాచ్.. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్