Best Test Team Of 2023 : ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు జట్టు(Best Test Team)ను ఆదివారం క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) ప్రకటించింది. 2023లో అద్భుతంగా రాణించిన 11 మందిని ఈ జట్టుకు ఎంపిక చేసింది. ఆసీస్‌కు ప్రపంచ టెస్టు చాంపియన్ గద(Test Mace)ను అందించిన ప్యాట్ కమిన్స్(Pat Cummins) సారథిగా ఉన్న ఈ టీమ్‌లో ఇద్దరు భారత క్రికెటర్లు చోటు దక్కించుకోగా.. ఐర్లాండ్‌కు చెందిన లోర్కన్ టక్నర్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే.. మిడిలార్డర్లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్(Kane Williamson), జో రూట్(Joe Root), హ్యారీ బ్రూక్(Harry Brook) స్థానం సంపాదించారు. ఇక బౌలింగ్ యూనిట్లో రవీంద్ర జడేజా, అశ్విన్, కగిసో రబాడ, కమిన్స్, మాజీ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ సెలెక్ట్ అయ్యారు.
ఖవాజా, అశ్విన్, స్టువార్ట్ బ్రాడ్
ఈ ఏడాది ఖవాజా ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. యాషెస్ సిరీస్(Ashes Seires)లో సెంచరీతో కలిపి ఈ స్టార్ ఓపెనర్ 2023లో 52.60 సగటుతో రాణించాడు. ఇక కరుణరత్నే 60.80 సగటుతో ఏకంగా 608 పరుగులు సాధించాడు.
విలియమ్సన్
ఇక మూడో స్థానానికి ఎంపికైన విలియమ్సన్ ఈ ఏడాది 7 మ్యాచుల్లో 696 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ తరఫున మిడిలార్డర్లో నిలకడగా రాణిస్తున్న జో రూట్, హ్యారీ బ్రూక్‌లు 1,500 రన్స్ కొట్టారు. వికెట్ కీపర్‌గా ఎంపికైన టక్నర్ 4 మ్యాచుల్లో 44 సగటుతో 351 రన్స్ స్కోర్ చేశాడు.
బెస్ట్ టెస్ట్ జట్టు 2023 : ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, బ్రూక్, టక్నర్(వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), రబాడ, స్టువార్ట్ బ్రాడ్.
లోయర్ మిడిల్ ఆర్డర్లో చోటు సంపాదించిన జడేజా, అశ్విన్ ఈ ఏడాది అద్భుతంగా రాణించారు. జడ్డూ 281 రన్స్ చేసి 33 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 17.10 సగటుతో 41 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రబాడ విషయానికొస్తే తాజాగా ముగిసిన తొలి టెస్టులో భారతజట్టుపై 7 వికెట్ల ప్రదర్శనతో 500 వికెట్ల క్లబ్లో చేరాడు.
ఈ సఫారీ పేసర్ 2023లో 20 వికెట్లు తీశాడు. ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో రాణించిన బ్రాడ్ మొత్తంగా 38 వికెట్లతో అదరగొట్టాడు. అయితే.. జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందర్నీ షాక్‌కు గురి చేశాడు.