MLC Jeevan Reddy | కల్యాణలక్ష్మి పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలకవ్యాఖ్యలు.. వాళ్లకే లక్ష, తులం బంగారం
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిందని, ఆ తేదీ తర్వాత వివాహం చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు.
MLC Jeevan Reddy | జగిత్యాల, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిందని, ఆ తేదీ తర్వాత వివాహం చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించి ప్రకటించిన విద్యా భరోసాను సైతం రానున్న విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పారు.అర్హత కలిగిన ప్రతి వివాహితకు రూ.2500 సాయం అందిస్తామని తెలిపారు.
జగిత్యాల రూరల్ మండలం పొలాసలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణలో శనివారం జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాపాలనలో స్వీకరిస్తున్న అభయ హస్తం దరఖాస్తులను పరిశీలించి, అర్హులైనవారికి ఫిబ్రవరి నుంచి పథకాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. గ్యారెంటీల అమలుకు అర్హులు దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వమే దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్లలో ఇంటి నిర్మాణం పథకాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేసిందని అన్నారు. చేయూత పథకం సైతం ప్రజలను అయోమయానికి గురిచేసిందని చెప్పారు. కొత్త పెన్షన్ల మంజూరును మూడేండ్లపాటు నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ పెన్షన్ వర్తింపజేస్తుందని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గంలోని సీపీడబ్ల్యూ పథకాలు పునరుద్ధరించాలని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన లబ్ధిపొందడం లబ్ధిదారుల హకు అని, అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

