పండుగ పూట..జర పైలం!
దీపావళి అంటేనే.. కుటుంబ సభ్యులు-బంధుమిత్రుల కలయికలు, పూజలు, నోరూరించే మిఠాయిలు, ఘుమఘుమలాడే పిండివంటలు, అర్ధరాత్రి వరకు కాల్చే టపాసులు.. అంతా సందడే! ఈ కోలాహలంలో డైలీ రొటీన్ దెబ్బతింటుంది.
దీపావళి అంటేనే.. కుటుంబ సభ్యులు-బంధుమిత్రుల కలయికలు, పూజలు, నోరూరించే మిఠాయిలు, ఘుమఘుమలాడే పిండివంటలు, అర్ధరాత్రి వరకు కాల్చే టపాసులు.. అంతా సందడే! ఈ కోలాహలంలో డైలీ రొటీన్ దెబ్బతింటుంది. ఆరోగ్యం ఒడుదొడుకులకు లోనవుతుంది. అయితే, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే.. ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా పండుగ ఆనందంగా సాగిపోతుంది.
పండుగ వేళ పిండివంటలు కామన్! చూడగానే తినాలనిపిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ తింటే.. కడుపు ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి సమస్యలు పలకరిస్తాయి. ఇక దీపావళి స్పెషల్.. రకరకాల స్వీట్లు. కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్తులు, పెద్దవాళ్లు అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్ సూచన మేరకు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, తిండి విషయంలో పరిమితులు పాటించాలి. ఇక, మహిళలు పూజల కోసం ఉపవాసం ఉంటారు. కాబట్టి, పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఇంట్లో చేసిన స్నాక్స్ తీసుకోవడం మంచిది.
పూజలు, పటాకుల మోతలతో.. రాత్రిళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోతుంటారు. ఇలా నిద్ర తగ్గడం వల్ల మరుసటి రోజు ఏకాగ్రత, ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి, పండుగ రోజుల్లోనూ ఒకే సమయానికి పడుకునేలా చూసుకోండి. రాత్రిపూట కాఫీ, టీలు ఎక్కువగా తాగకండి. వేడుకలు ముగిసిన తర్వాత ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేందుకు కాస్త సమయం కేటాయించండి.
పండుగ పనులతో బిజీగా ఉండటం వల్ల సరిపడా నీళ్లు తాగడం మరచిపోతుంటారు. ఎక్కువసేపు వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ప్రయాణాలు లేదా వేడుకల్లో ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అందుకే, వాటర్ బాటిల్‌ను ఎప్పుడూ వెంటే ఉంచుకుని.. తరచుగా నీళ్లు తాగుతూ ఉండండి. దాహం వేసే వరకూ ఆగవద్దు. ఇక కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు,కాఫీలను పక్కన పెట్టేయండి.
పండుగ బిజీలో.. ప్రతిరోజూ చేసే వ్యాయామం పక్కకు వెళ్లిపోతుంది. కొన్ని రోజులు వర్కౌట్ చేయకపోతే ఫిట్నెస్ ఏమీ తగ్గిపోదు.. కానీ, భారీ భోజనంతోపాటు శారీరక శ్రమ లేకపోతే బద్ధకం పెరుగుతుంది. అయితే, పండుగ రోజుల్లోనూ కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. భోజనం తర్వాత తేలికపాటి నడక, చిన్నచిన్న స్ట్రెచింగ్స్ లేదా ఇంట్లోనే చిన్నపాటి వర్కౌట్ చేస్తూ.. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవచ్చు.
పటాకులు పేలడం వల్ల వెలువడే కాలుష్య కారకాలు.. గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి. ఈ పొగ కళ్లు, ముక్కు, గొంతును ఇబ్బంది పెట్టడమే కాకుండా.. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తీవ్రం చేస్తుంది. పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాలుష్యం ఎక్కువగా ఉంటే బయట తిరగడం తగ్గించండి. ఆస్తమా రోగులు తమ ఇన్హేలర్లు, మందులను అందుబాటులో ఉంచుకోండి.
దీపాలు, కొవ్వొత్తులు, పటాకులు, విద్యుత్ దీపాల వల్ల.. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీపాలు, కొవ్వొత్తులను.. కర్టెన్లు, పేపర్ డెకరేషన్లకు దూరంగా ఉంచండి. పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలను ఒంటరిగా టపాకాయలు కాల్చనివ్వకండి. బహిరంగ ప్రదేశాలలో మాత్రమే అనుమతి ఉన్న టపాసులు (గ్రీన్ క్రాకర్స్) కాల్చండి. కాలుష్యాన్ని తగ్గించండి. మీతోపాటు మీ చుట్టూ ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పండుగ పూట..జర పైలం!
Palamuru Migration | నడిగడ్డ మళ్లీ వలసబాట..! సీఎం సొంత జిల్లాలో దారుణ పరిస్థితులు
KTR | బహిరంగ దోపిడీ.. కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
Mannе Krishank | మూడేండ్లకే ఆమె బిలియనీర్స్.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
Revanth reddy | నీళ్లు లేవు.. పంటలు వేయొద్దు.. వేసి నష్టపోతే ఏం చేయలేం.. మీ ఖర్మ: సీఎం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

