నీళ్లు లేవు.. పంటలు వేయొద్దు
- వేసి నష్టపోతే ఏం చేయలేం.. మీ ఖర్మ: సీఎం
- వరి వేస్తే నార్లకే నీళ్లు.. తర్వాత ఉండవు
- ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అడుగంటినయ్
- తాగడానికే నీళ్లు దొరుకుడు కష్టంగా ఉన్నది
- ఆరుతడి పంటలు మాత్రమే పండించండి
- రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
- నీళ్లెత్తుమంటే పాతి పెడ్తానని చిందులు
రాబోయే రోజుల్లో ఎండలు విపరీతంగా కొడుతయ్, నీళ్లు దొరుకవు, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు, ఉన్న నీళ్లు తాగడానికే సరిపోతయ్. వరి వేస్తే నార్ల వరకే నీళ్లు సరిపోతయ్, ఆ తర్వాత నీళ్లు ఉండవు. కరువుపై నేనేమీ చేయలేను. పంటలు వేసి నష్టపోవద్దు. అయినా సరే అని వేస్తే మీ ఖర్మ. ఆరుతడి పంటలు వేయండి, కూరగాయ పంటలు పండించండి.
– కొడంగల్ రైతుమేళాలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్, నవంబర్ 7 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం హోదాను మరచిన రేవంత్‌రెడ్డి మరోసారి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తిట్ల పురాణం అందుకున్నారు. కన్నెపల్లిలో నీళ్లు ఎత్తమంటే వాళ్లను ఇసుకలో పాతి పెడ్తానంటూ ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోయారు. శనివారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండ లం హకీంపేటలో ఏర్పాటుచేసిన రైతుమేళాలో ఆయన ప్రతిపక్షంపై నోటిదురుసు, కాళేశ్వరం, గోదావరి జలాల ఎత్తిపోతలపై ఎప్పటిలాగే పచ్చి అబద్ధాలు వల్లించారు. రాష్ట్రంలో ఎల్ నినో పేరుతో కరువు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ గట్టిగా ఎండగడుతుండటం తో ఎటూ పాలుపోని సీఎం.. విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నంలో సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు.
నీళ్లను ఎత్తిపోయడం లేదనే విమర్శల పై పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. అంతేగాక మేడిగడ్డ బరాజ్ కూలిపోయిందని, కన్నెపల్లిలో నీళ్లు ఎత్తినా తిరిగి మేడిగడ్డకి వస్తాయని మరోసారి అబద్ధాల ప్రచారానికి తెరలేపారు. ఇన్నాళ్లూ లక్ష కోట్లు అని ప్రచారం చేసి న రేవంత్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏకం గా 1,50,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ బరాజ్ కుప్పకూలడంతో కన్నెపల్లి నుంచి సాధ్యం కాదని అందుకే దేవాదుల నుంచి ఎత్తిపోతలు ప్రారంభించామని సెలవిచ్చారు. ఈ పరిస్థితుల్లో సాగునీళ్లు ఇవ్వలేమని రైతుల సాక్షిగా తేల్చిచెప్పారు. జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే మీ ఖర్మ అనేలా వ్యాఖ్యలు చేశారు.
కరువుపై తానేమీ చేసే పరిస్థితి లేదని చేతుల్తేశారు. ఓ వైపు ఎండలు, మరోవైపు నీళ్లు లేక రైతులకు ఈ కరువు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తదని పే ర్కొన్నారు. ‘అందుకే రైతులకు విజ్ఞప్తి చేస్తు న్నా.. ప్రభుత్వం మీ మేలు కోరుకుంటున్నది, మీ కష్టాలు తీర్చాలనుకుంటున్నది, ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నది, ఆరుతడి పంటలు వే యండి, కూరగాయలు పండించండి. పాలకూర, మెంతికూర, టమాటలు, వంకాయలు, మిరపకాయలు, మక్కజొన్న, పసుపు ఇంకా ఆరుతడి పంటలు పండించాలని సూచించా రు. నీళ్లు ఎక్కువ అవసరం ఉన్న పంటలు పండిస్తే నీళ్లు ఉండవని స్పష్టంచేశారు. వచ్చే 8-10 నెలలపాటు వానలు ఉండవని, ఉన్న నీళ్లు దాచి పెట్టుకొని వాడుకునే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. లాభం రాకపోయినా సరే పెట్టుబడి నష్టపోయే పరిస్థితి రాకూడదని, ప్రభుత్వం చెప్పినట్టు వింటే మేలు జరుగుతుందని లేకపోతే నష్టం తప్పదని హెచ్చరించారు.
పెద్ద పెద్ద ప్రాజెక్టులే అడుగంటినయ్
ఈ సీజన్లో వర్షాలు తక్కువగా పడటంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీళ్లు లేవని సీఎం రేవంత్ తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, మంజీరా ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ అడుగంటాయని, జూరాలలోనూ నీళ్లు లేవని పేర్కొన్నారు. వందల టీఎంసీల నీళ్లు ఉండే ఈ ప్రాజెక్టులు అడుగంటిపోయి నెర్రెలు బారుతున్న పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అడుగులో ఉన్న నీళ్లనే దాచుకొని దాచుకొని తాగు నీళ్లకు వాడుకునే దుస్థితి ఏర్పడిందన్నారు.
కరువంటూనే.. కాళేశ్వరంపై కక్ష
రాష్ట్రంలో కరువు తప్పదంటున్న రేవంత్‌రెడ్డి.. కరువు నుంచి రక్షించే కాళేశ్వరంపై మాత్రం రాజకీయ కక్ష గట్టడం మానడం లేద నే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కు టుంబంపై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా, నీళ్లు ఎత్తిపోయకుండా రైతులు, ప్రజల ఉసురుపోసుకుంటున్నాడనే ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోస్తే ఈ కరువు ఉండేది కాదని సీఎం స్వయంగా చెప్తున్నారు. అలాంటప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ మూడేండ్ల నుంచి ఏం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కక్షసాధింపులను పక్కనపెట్టి మేడిగడ్డ బరాజ్‌ను రిపేర్ చేసి ఉంటే ఇప్పుడు ఈ కరువు నుంచి గట్టెక్కే వాళ్లం కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి.
మేడిగడ్డ గేట్లు ఎత్తకుండా నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యమని చెప్తున్న సీఎం.. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇంజినీర్లు, సాగునీటి నిపుణులు, కేంద్ర సంస్థలు సూచించినట్టు కాఫర్ డ్యామ్ నిర్మించి నీళ్లు ఎత్తిపోయవచ్చని చెప్పినా ఎం దుకు వినలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పు డు కరువు నెత్తిమీదకు రావడం, కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా ఈ కరువుకు కాంగ్రెస్ కారణమైందనే విమర్శల నేపథ్యంలో దీన్ని నుంచి తప్పించుకొనేందుకు డ్రామా మొదలుపెట్టారని తెలుస్తున్నది. మళ్లీ పాత కథను ముంగటేసుకొని.. అవే ఆరోపణలు, అవే తిట్లతో ప్రజ ల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కరువు ధరను ఖాతాలో వేసుకునే తత్వం
రేవంత్ సంకుచిత మనస్తత్వం ఎలా ఉన్నదంటే.. కరువుతో పంట ఉత్పత్తుల ధర పెరిగితే అది తన వల్లేనని, అదంతా తన గొప్పతనమేనని చెప్పుకొనే పరిస్థితి ఉన్నది. వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిన పరిస్థితుల్లో పంటలు పండే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆయనే స్వయంగా వరి సాగుచేయొద్దని పిలుపునిచ్చారు. దీంతో మార్కెట్లో వరితోపాటు ఇతర పంట ఉత్పత్తుల ధరలు పెరిగా యి. ఇది తన వల్లేనని చెప్పుకొన్నారు. మార్కె ట్లో సన్నధాన్యం ధర రూ.4,500 వరకు పలికిందని, పండిన పంటకు పొలంలోనే అడ్వా న్స్ ఇస్తున్నారని తెలిపారు. దీనికి తాను గతం లో ఏడు రకాల సన్నవడ్లు పండించాలని చెప్పడమే కారణమన్నారు. ‘మేం చెప్పినట్టు పం డించిన రైతులకు వేలు వస్తున్నయి, ఇలా మా మాట నమ్మినోళ్లకు మేలు జరుగుతున్నదని పేర్కొన్నారు. వాస్తవానికి సన్నధాన్యానికి బోన స్ ఎగ్గొట్టే కుట్రతో 32 రకాల సన్నధాన్యం జాబితాను ఏడు రకాలకు కుదించారు. ఇప్పుడు కరువు పరిస్థితులతో సన్నధాన్యానికి ధర పెరుగడంతో అది తన వల్లేనని చెప్పుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్.. ఆ లాజిక్ నీకు వర్తించదా?
సీఎం రేవంత్‌రెడ్డి మక్తల్-నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచి అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం అంచనాలు ఎందుకు పెరిగాయో చెప్పారు. అప్పుడు సిమెంట్ ధర ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నది?, అప్పుడు ట్రాక్టర్ ఇసుక ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది?, అప్పుడు స్టీల్ ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది?, అప్పుడు కూలీ ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది అని ప్రశ్నించారు. ఈ లెక్కలు చూస్తే అర్థం కాదా.. అంచనాలు ఎందుకు పెరిగాయో అని ప్రశ్నించారు. అయితే ఇదే సభలో ఆయన నోటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 38వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. మరి కొడంగల్ ప్రాజెక్టు వ్యయం పెరిగితేనేమో ధరలు పెరిగినట్టు చెప్పిన ఆయన.. మరి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెరుగుదలకు అది వర్తించదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మీ విషయానికొచ్చేసరికి ధరలు పెరిగుతాయి.. బీఆర్ఎస్ విషయానికొచ్చేసరికి అవినీతి అవుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
గులాబీ పూలున్నాయని బొకేలు పడేశారు
రైతుమేళాకు కొందరు గులాబీ పూలతో బోకేలు తీసుకొచ్చారు. గులాబీ పూలు అంటే సీఎం అంగీకరించరని చివరి నిమిషంలో వ్యవసాయ శాఖ అధికారులు వాటిని పక్కకు పడేశారు. అసలే కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ వస్తున్న విమర్శలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో గులాబీ బొకేలు కనిపించకుండా దాచేయడం అధికారుల వంతైంది.
అరకొర వసతులు.. రైతులకు ఇక్కట్లు
హకీంపేటలో రైతు మేళాలో అరకొర ఏర్పాట్లు చేయడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. దాదాపు నాలుగైదు జిల్లాల నుంచి బస్సులను పెట్టి రైతులను తరలించారు. ఒక్కో బస్సులో సగం మంది కూడా లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆకుపచ్చ కండువా వేసి తీసుకొచ్చారు. మరోవైపు వ్యవసాయ శాఖ పరికరాలు, ఎరువులను అమ్మే వ్యాపారులను, డీలర్లను సైతం ఈ మేళాకు రప్పించారు. వచ్చిన వాళ్లకు సరైన వసతులు కల్పించలేదు. ఎండ వేడిమితో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం సభకు వచ్చిన మీడియా ప్రతినిధులకు కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వకుండా యంత్రాంగం చేతులెత్తేసింది.
మూడు రోజులు ఊళ్లో ఉండొద్దని హుకుం..
సీఎం పర్యటన కోసం దుద్యాల మండలంలోని బీఆర్ఎస్ నేతలకు పోలీసులు బెదిరింపులకు దిగారు. సీఎం మూడు రోజులపాటు ఇక్కడే ఉంటాడని మీరంతా ఊర్లలో కనిపించవద్దని హుకుం జారీ చేయడంతో వాళ్లంతా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. సీఎం పర్యటన ఖరారైనప్పటి నుంచి దుద్యాల, లగచర్ల, పోలేపల్లి, హకీంపేటతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని బీఆర్ఎస్ నేతలు, వార్డు సభ్యులు వేధిస్తున్నారు.
మళ్లీ చావు భాష… అదే నోటి దరుసు
సీఎం హోదా మరచి రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై నోటిదురుసు ప్రదర్శించారు. ప్రజలు ఈసడించుకునేలా మరోసారి చావు భాషతో తన స్థాయిని దిగజార్చుకున్నారు. తాటతీసి తోలు వేలాడకడ్తా, ఇసుకలో పాతిపెట్టినా పాపం పోదు, తాడిచెట్టుకు ఉరేయాలి, రాష్ట్ర ప్రజలంతా చచ్చిపోవాలి, జాతి, రీతి అంటూ నోటికొచ్చిన బూతులను వదిలేశారు. నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ మేడిగడ్డ బరాజ్‌ని సందర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వాళ్లను ఆ ఇసుకలోనే పాతిపెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో చర్చకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తాతల్ని, ముత్తాతల్ని వాళ్లందర్నీ అసెంబ్లీకి రమ్మనండి.. వాళ్ల తాట తీసి తోలు వేలాడకతాం అంటూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల చావు కోరుకోవడమే ఈయన పనా? అంటూ విమర్శిస్తున్నారు. కరువు నుంచి ఎలా బయటపడాలో ఆలోచకుండా, ఇప్పటికీ ప్రతిపక్షంపై నిందలు వేస్తూ, వాళ్ల చావు కోరుకుంటే ఈయన సీఎంగా ఉండి ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.
రేవంత్‌కు ఓటమి భయం పట్టుకున్నది
- మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
సీఎం రేవంత్‌కు ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే మూడు రోజులు కొడంగల్‌లో తిష్ట వేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఎన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో ఆయన కొడంగల్ నుంచి పారిపోవడం ఖాయమని తేల్చిచెప్పా రు. రేవంత్ మూడేండ్లవుతున్నా నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప ఏ ఒక్కటీ కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశా రు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తుండటంతో వాటిని కూల్చడం తప్ప కొత్తగా నిర్మించింది ఏమీలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద రైతుల కడుపులు కొట్టి బలవంతంగా భూము లు లాక్కొని ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తన కు టుంబ సభ్యులకు భూములను దోచిపెట్టేందుకే దీన్ని నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించి పూర్తిచేసిన ఒక్క కార్యక్రమమైనా ఉన్నదా చూపించాలని సవాల్ విసిరారు. కారిడార్‌లో భూములు కోల్పోయిన రైతులను బెదిరించి భూములు తీసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం సభ కోసం ఓ రైతు నాలుగు ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు కరెంటు కలెక్షన్ తొలగించి పంట ఎండిపోయేలాగా చేసి ఆ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకునేలా చేశారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

