బహిరంగ దోపిడీ
తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న దోపిడీని వివరించడానికి క్రోనీ క్యాపిటలిజం, బహిరంగ దోపిడీ, క్లెప్టోక్రసీ వంటి పదాలు కూడా సరిపోవడం లేదు. ఏకంగా మంత్రి కంపెనీకే టెండర్లు కట్టబెడుతున్న రేవంత్ సర్కార్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించి ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలె.
- క్రోనీ క్యాపిటలిజం, క్లెప్టోక్రసీ వంటి పదాలూ సరిపోవు
- కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
- కంచే.. చేను మేస్తున్నట్టున్నది.. ప్రభుత్వం తీరు
- కొడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల
- టెండర్లలోనూ పొంగులేటి కంపెనీకే ప్రయోజనం
- 1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు పెంపు
- చుక నీరివ్వకముందే ఐదు రెట్లకు పెరిగిన వ్యయం
- బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు
తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న దోపిడీని వివరించడానికి క్రోనీ క్యాపిటలిజం, బహిరంగ దోపిడీ, క్లెప్టోక్రసీ వంటి పదాలు కూడా సరిపోవడం లేదు. ఏకంగా మంత్రి కంపెనీకే టెండర్లు కట్టబెడుతున్న రేవంత్ సర్కార్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించి ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలె.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కంచే.. చేను మేసిన చందంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల సంపదకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వం.. సొంతవారికి దోచిపెడుతున్నదని నిప్పులు చెరిగారు. కొడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలిపారు.
‘ఓడినా పైచేయి నాదే’ అన్నట్టుగా సర్కార్ వ్యవహారం ఉన్నదని విమర్శించారు. కొడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటికి చెందిన సొంత కంపెనీ కూడా టెండర్లలో పాల్గొన్నదని ఆరోపించారు. మిగతా కంపెనీలన్నీ కేవలం కాగితాలపైనే ఉన్న నామమాత్రపు సంస్థలని, చివరికి ఒక కంపెనీ మాత్రమే పోటీలో మిగిలి విజయం సాధించేలా వ్యవహారం నడిచిందని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ఐదు రెట్లు పెరిగిన ప్రాజెక్టు వ్యయం
ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. 2014లో సుమారు రూ.1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.6,825 కోట్లకు చేరిందని పేరొన్నారు. అంటే దాదాపు ఐదు రెట్ల వ్యయం పెరిగిందని, ప్రజాధనాన్ని ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నా ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా చుక నీరు కూడా కాంగ్రెస్ సర్కార్ అందించలేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ, టెండర్ల ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. ఓవైపు తెలంగాణలో ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంటే, మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బహిరంగ దోపిడీకి పదాలు సరిపోవు
టెండర్ల వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించి ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. క్రోనీ క్యాపిటలిజం, క్లెప్టోక్రసీ వంటి పదాలు కూడా తెలంగాణలో జరుగుతున్న ఈ దోపిడీని వివరించడానికి సరిపోవడం లేదని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో తమకు అనుకూలమైన కంపెనీలకే ప్రయోజనం చేకూర్చే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

