e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home స్పోర్ట్స్ సిట్సి‘పాస్‌'

సిట్సి‘పాస్‌’

సిట్సి‘పాస్‌'
  • ఫైనల్‌ చేరిన తొలి గ్రీక్‌ ప్లేయర్‌
  • పోరాడి ఓడిన జ్వెరెవ్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌

‘చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. చిన్నప్పుడు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ ఆడాలనుకునేవాడిని. అది ఇప్పుడు సాధ్యపడుతున్నది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో ఇది ఎంతో ప్రత్యేకం’

సిట్సిపాస్‌

ఇంటి ముందు ఖాళీ స్థలంలో ప్రాక్టీస్‌ ప్రారంభించినప్పటి నుంచి కన్న కల.. టెన్నిస్‌లో ఓనమాలు దిద్దినప్పటి నుంచి పెట్టుకున్న లక్ష్యం.. ప్రొఫెషనల్‌గా మారినప్పటి నుంచి ముద్దాడాలనుకున్న గమ్యాన్ని ‘గ్రీకువీరుడు’ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ చేరుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో జ్వెరెవ్‌ను చిత్తుచేసిన సిట్సిపాస్‌ తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. రోలాండ్‌ గారోస్‌లో ఈ ఘనత సాధించిన తొలి గ్రీక్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

పారిస్‌: ఆరంభంలో తిరుగులేని ఆధిపత్యం.. ఆనక ఒత్తిడికి చిత్తై వరుస ఓటములు.. అయినా కడవరకు పోరాడిన గ్రీక్‌ ప్లేయర్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ కెరీర్‌లో మొదటిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ 6-3,6-3,4-6,4-6,6-3తో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్‌లు చేజిక్కించుకున్న సిట్సిపాస్‌ సునాయాసంగా ఫైనల్‌ చేరుతాడనుకుంటే.. జ్వెరెవ్‌ అద్భుత పోరాట పటిమ చూపడంతో సిట్సిపాస్‌ వరుసగా రెండు సెట్‌లు కోల్పోయాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌ ఆరంభం నుంచి విజృంభించిన సిట్సిపాస్‌ తప్పిదాలకు తావివ్వకుండా చరిత్ర లిఖించాడు.

మూడున్నర గంటల పోరాటం

మేజర్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు మూడు సార్లు సెమీస్‌ చేరిన సిట్సిపాస్‌ ఒక్కసారి కూడా తుదిపోరుకు చేరుకోలేకపోగా.. శుక్రవారం 3 గంటల 37 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరులో అతడి శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. క్రాస్‌ కోర్ట్‌, బ్యాక్‌ హ్యాండ్‌, ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో చెలరేగిన సిట్సిపాస్‌.. కీలక సమయాల్లో ఒత్తిడిని జయిస్తూ ముందంజ వేశాడు. జ్వెరెవ్‌ కంటే తక్కువ ఏస్‌లు కొట్టిన సిట్సిపాస్‌.. మూడు డబుల్‌ ఫాల్ట్స్‌ మాత్రమే చేస్తే.. 7 తప్పిదాలతో జ్వెరెవ్‌ మూల్యం చెల్లించుకున్నాడు. విన్నర్లలోనూ జ్వెరెవ్‌ ముందున్నా.. అనవసర తప్పిదాలు తక్కువ చేసిన సిట్సిపాస్‌ను విజయం వరించింది. శనివారం జరుగనున్న మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో 31వ సీడ్‌ అనస్తాసియా పవ్ల్యూచెంకోవా (రష్యా) తలపడనుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిట్సి‘పాస్‌'

ట్రెండింగ్‌

Advertisement