హాంకాంగ్: భారత యువ షట్లర్లు త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రిక్వార్టర్స్‌కు చేరింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ టూర్ సూపర్-500 ఈవెంట్లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా జాలీ-గాయత్రి జోడీ 21-14, 21-14తో పొలిన బుహ్రొవ-యెవ్హెనియ కంటెమిర్(ఉక్రెయిన్)ను ఓడించి ప్రిక్వార్టర్స్ చేరింది. అయితే పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ చేరిన మానవ్ చౌదరి, చిరాగ్ సేన్ ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.