అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై భారత క్రీడాలోకం స్పందించింది. రోహిత్, కోహ్లీతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళి అర్పించారు.
విమాన ప్రమాద ఘటన చూసి షాక్‌కు గురయ్యా. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
– కోహ్లీ
ఈ దుర్ఘటన నా మనసును తీవ్రంగా కలిచివేసింది. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నాను
– రోహిత్‌శర్మ
ఈరోజు అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సిన విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడం బాధ కల్గించింది. ప్రమాదంలో మరణించిన 242 మంది మృతుల ఆత్మకు శాంతి చేకూరాలి. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆ దేవుడు మనో ధైర్యాన్ని కల్గించుగాక
– పీవీ సింధు
విమాన ప్రమాదం చాలా బాధ కల్గించింది. జీవితం చాలా విలువైనది. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబసభ్యులకు దేవుడు అండగా ఉంటాడని ఆశిస్తున్నాను
– సిరాజ్