చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన తర్వాత ఆ టీమ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మరో పరీక్ష ఎదుర్కొన్నాడు. అది ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ పెట్టిన హిందీ పరీక్ష. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇండియన్ ప్లేయర్స్‌తో కలిసిమెలిసి ఉంటున్న విదేశీ ప్లేయర్స్ హిందీపై పట్టు సాధిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అయితే హిందీని అనర్గళంగా మాట్లాడే స్థాయికి వచ్చేశాడు. తాజాగా న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా మెల్లమెల్లగా హిందీ నేర్చుకునే పనిలో ఉన్నాడు.
నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్.. అతన్ని ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అతన్ని హిందీలో ఓ ప్రశ్న అడిగాడు. చివరి ఓవర్లో 15 పరుగులను డిఫెండ్ చేసి మ్యాచ్‌ను గెలిపించడం ఎలా అనిపిస్తోంది అని హిందీలో అడిగాడు సూర్యకుమార్. దీనికి బౌల్ట్ స్పందిస్తూ.. లాస్ట్ ఓవర్.. బహుత్ అచ్చా హై అంటూ సమాధానమిచ్చాడు.
చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న ఆండ్రీ రసెల్, దినేష్ కార్తీక్‌లాంటి హిట్టర్లను బౌల్ట్ బోల్తా కొట్టించాడు. స్లో బంతులతో చుక్కలు చూపించాడు. దీంతో చివరి ఓవర్లో నైట్ రైడర్స్ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగింది.
When SKY meets Thunder Boult ⚡️⚡️
— IndianPremierLeague (@IPL) April 14, 2021
Batting brilliance, last-over nerves & some fun in Hindi. 😎😎 #VIVOIPL #KKRvMI @Vivo_India @mipaltan
This @trent_boult–@surya_14kumar interview by @28anand has it all. 👌👌
Watch the full interview here 🎥👇 https://t.co/KMu8KcifQ3 pic.twitter.com/jJTTtaIxxM
ఇవి కూడా చదవండి
కరోనా ఆంక్షలు.. రైల్వే స్టేషన్ ముందు భారీ క్యూలైన్లు
శంకర్‌తో రణ్వీర్.. అపరిచితుడు హిందీ రీమేక్
స్విగ్గీని నిషేధించాలంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్‌తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
కుంభమేళాను మర్కజ్‌తో పోల్చవద్దు..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం