Hong Kong Open 2024 : హాంకాంగ్ ఓపెన్‌లో భారత మహిళా షట్లర్లకు ఊహించని షాక్ తగిలింది. త్రీసా జాలీ, గాయత్రీ గోపిచంద్ ద్వయం ప్రీ-క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ చైనా జంట చేతిలో త్రీసా, గాయత్రి జోడీ ఓటమి పాలైంది. లీ షెంగ్, టాన్ నింగ్ల ధాటికి తొలి సెట్ కోల్పోయిన భారత అమ్మాయిలు రెండో సెట్లో పుంజుకున్నారు. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. కానీ, చివరకు 11-21, 20-22తో భారత జోడీ పరాజయం పాలైంది.
ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో యువకెరటం చిరాగ్ సేన్ (Chirag Sen) క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. టైటిల్ వేటలో దూసుకెళ్తున్న మానవ్ చౌదరీ (Manav Choudhary) అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఇక మహిళల విభాగంలో పాండా సిస్టర్స్ రుతపర్ణ, శ్వేతపర్ణ జోడీ చైనీస్ తైపీ ద్వయం చేతలో కంగుతిన్న విషయం తెలిసిందే.