Monsoon | ఇక నైరుతి రుతుపవనాల ఉపసంహరణ..! అక్టోబర్ 15 నాటికి తిరోగమనం..!
Monsoon | ఈ నెల 19 నుంచి 25 మధ్య నైరుతి రుతుపవనాలు దేశం నుంచి తిరోగమించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళను తాకుతాయి. జూలై 8 వరకు దేశవ్యాప్తంగా విస్తరిస్తుంటాయి.
Monsoon | ఈ నెల 19 నుంచి 25 మధ్య నైరుతి రుతుపవనాలు దేశం నుంచి తిరోగమించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళను తాకుతాయి. జూలై 8 వరకు దేశవ్యాప్తంగా విస్తరిస్తుంటాయి. సెప్టెంబర్ నాటికి వాయువ్య భారతం నుంచి ఉప సంహరణ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 17 నుంచి తిరుగోమనం మొదలై.. అక్టోబర్ 15 నాటికి తిరుగుముఖం పడుతాయి. వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు వారం రెండోభాగంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నాలుగు నెలల రుతుపవనాల సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి దేశంలో 836.7 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.
సాధారణం 772.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదైంది. వాయువ్య భారతంలో 4శాతం, మధ్య భారతంలో 19శాతం, దక్షిణ భారతంలో 25శాతం ఎక్కువ వర్షాపాతం రికార్డయ్యింది. రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు బలహీనపడుతాయని వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. తిరుగుముఖం పట్టిన రుతుపవనాలు గంగా మైదానం ద్వారా బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంటాయి. ఈ క్రమంలో ఈశాన్యం నుంచి తిరోగమనం చెందడంతో వీటిని ఈశాన్య రుతుపవనాలుగా పేర్కొంటారు. వీటితో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

