Shakib Al Hasan : పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌లో తిప్పేసిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్(Shakib Al Hasan) కౌంటీల్లోనూ చెలరేగాడు. మూడేండ్ల విరామం తర్వాత కూడా తనలో సత్తా తగ్గలేదని చాటాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన షకీబ్ ఏకంగా 9 వికెట్లతో ప్రత్యర్థి జట్టును వణికించాడు. దాంతో, త్వరలోనే భారత్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న బంగ్లాదేశ్ షకీబ్ సంచలన ప్రదర్శన పట్ల మస్త్ ఖుషీగా ఉంది.
కౌంటీ చాంపియన్‌షిప్‌లో సర్రే(Surrey) జట్టు తరఫున ఆడిన షకీబ్.. సొమర్సెట్(Somerset) బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో రాణించిన ఈ మిస్టరీ స్పిన్నర్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరహో అనిపించాడు. దాంతో, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 25వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు.
9/193 on Surrey debut for Shakib Al Hasan! 🇧🇩
🤎 | #SurreyCricket pic.twitter.com/iM56XN72Y7
— Surrey Cricket (@surreycricket) September 12, 2024
భారత జట్టుతో రెండు టెస్టుల సిరీస్లోనూఈ విధంగానే విజృంభించాలని షకీబ్ పట్టుదలతో ఉన్నాడు. టీమిండియాపై మెరుగైన రికార్డు కలిగిన షకీబ్ ఈ తరహాలో తిప్పేయడం నజ్ముల్ హుసేన్ శాంటో సేనకు నిజంగా బలాన్నిచ్చేదే.సెప్టెంబర్ 19వ తేదీన భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 27న రెండో టెస్టు ఉంది.