Neeraj Chopra : వరుసగా రెండు విశ్వ క్రీడల్లో పతకాలతో యావత్ భారతాన్ని సంబురాల్లో ముంచిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో ఫైనల్‌కు సిద్ధమవుతున్నాడు. ఈమధ్యే లసానే డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన భారత ఈటె వీరుడు డైమండ్ లీగ్ (Diamond League) ఫైనల్లో అగ్రస్థానంపై గురిపెట్టాడు. స్టీపుల్ చేజ్ విభాగంలో అవినాశ్ సబ్లే (Avinash Sable) సైతం చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. బ్రస్సెల్స్ వేదికగా శుక్ర, శనివారాల్లో జరిగే ఈ టోర్నీలో విజయం సాధిస్తే వీళ్లిద్దరికి భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది.
డైమండ్ లీగ్ క్వాలిఫయింగ్ పోటీల్లో నీరజ్ 14 పాయింట్లతో టాప్ – 6లో నిలిచాడు నిలిచాడు. ఒలింపిక్స్‌లో 89.45 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్ చోప్రాకు అండర్సన్ పీటర్స్, జులియన్ వెబర్, జాకుబ్ వాద్లెజ్, చోప్రా, ఆండ్రియన్ మర్డరె, రోడెరిక్ జెన్కీ డీన్లు గట్టి పోటీ ఇచ్చారు. ఫైనల్లో విజేతగా నిలవాలంటే భారత స్టార్ అథ్లెట్ నీరజ్ వీళ్ల కంటే ఎక్కువ దూరం జావెలిన్‌ను విసరాల్సి ఉంటుంది.
అయితే.. ఇప్పటివరకూ 90 మీటర్ల మార్క్ అందుకోని అతడికి ఇది పెద్ద సవాలే కానుంది. బహుశా ఈ ఫైనల్ తర్వాత నీరజ్ సర్జరీ చేసుకునే అవకాశముంది. ‘ఈ సీజన్లో నేను ఇంకా ఒకటి లేదా రెండు పోటీల్లో పాల్గొంటాను. బహుశా బ్రస్సెల్స్ జరుగబోయే డైమండ్ లీగ్ ఫైనల్ చివరిది కావొచ్చు’ అని చోప్రా వెల్లడించిన విషయం తెలిసిందే. డైమండ్ లీగ్ విజేతలకు నిర్వాహకులు రూ.25 లక్షలు అందించనున్నారు. రెండో స్థానంలో నిలిచిన వాళ్లకు రూ.12 లక్షలు .. టాప్ -8లోని మిగతావాళ్లకు రూ. 83 వేలు నగదు బహుమతిగా దక్కనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ ముందు గజ్జల్లోని కండరాల సమస్య(స్పోర్ట్స్ హెర్నియాలో ఒక రకం)తో చోప్రా బాధ పడ్డాడు. దాంతో, అతడి
సన్నద్ధత కూడా సరిగ్గా జరగలేదు. అయినా సరే.. చోప్రా విశ్వ క్రీడల్ల అదరగొట్టాడు. ఫైనల్లో 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి సిల్వర్ మెడల్‌తో చరిత్ర సృష్టించాడు.
పారిస్ ఒలింపిక్స్ ముందు గజ్జల్లోని కండరాల సమస్య(స్పోర్ట్స్ హెర్నియాలో ఒక రకం)తో చోప్రా బాధ పడ్డాడు. దాంతో, అతడి
సన్నద్ధత కూడా సరిగ్గా జరగలేదు. అయినా సరే .. చోప్రా విశ్వ క్రీడల్ల అదరగొట్టాడు. ఫైనల్లో 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి సిల్వర్ మెడల్‌తో చరిత్ర సృష్టించాడు. దేశానికి పతకం అందించాలనే తన లక్ష్యం పూర్తి కావడంతో కొన్ని రోజుల బ్రేక్ తీసుకుంటానని నీరజ్ చెప్పాడు. సర్జరీ చేసుకోవాలని అనుకున్న అతడు గాయం తీవ్రత ఎక్కువ లేనందున మళ్లీ ఈటెను అందుకున్నాడు. సర్జరీ వాయిదా వేసుకొని.. లసానే డైమండ్ లీగ్‌లో పోటీ పడిన నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.