హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో బీసీలకు(BCs) ఆరు మంత్రి వదవులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) డిమాండ్ చేశారు. గతంలో రెండు మంత్రి పదవులు(Minister Posts) ఇచ్చారని, అవికూడా ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించారని ఆరోపించారు. గురువారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపని, కార్పొరేషన్ చైర్మన్ పదవుల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన సామాన వాటా ఇవ్వాల్సిందిపోయి తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో బీసీల మద్దతుతోనే అధికారంలో వచ్చి బీసీలను కాంగ్రెస్ విస్మరిస్తుందని, సీఎం రేవంత్రెడ్డి బీసీల పట్ల తన వైఖరి మార్చకోవాలని సూచించారు.
కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులలో బీసీలకు 50 వాటా ఇవ్వాలని, బీసీ కులాలకు కార్పొరేషన్, పాలకమండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదిక ఏర్పాటు చేయాలని, బీసీ గణనను జాప్యం లేకుండా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వేంకటేశ్, నందకిశోర్, అనంతయ్య, సతీశ్, రవి, నిఖిల్, మణికంఠ పాల్గొన్నారు.