టోక్యో: ఒలింపిక్స్ ఓపెనింగ్సెర్మనీకి మరో రోజు మాత్రమే ఉన్న సమయంలో సెర్మనీ డైరెక్టర్ కెంటారో కొబయాషిపై వేటు పడింది. ఆయనకు సంబంధించిన రెండు దశాబ్దాల కిందటి ఓ కామెడీ నాటకానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడం దీనికి కారణం. హోలోకాస్ట్ (రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదుల ఊచకోత) విషాదాన్ని ఓ కామెడీ స్కిట్ కోసం కొబయాషి ఉపయోగించుకోవడంపై ఒలింపిక్స్ చీఫ్ సీకో హషిమోటో అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిజానికి ఇది 1998లో కొబయాషి వేసిన స్కిట్. ఇందులో ఓ పెను విషాదాన్ని హేళన చేసినట్లుగా కొబయాషి మాట్లాడటం దారుణమని, అందుకే ఆయనను ఒలింపిక్స్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు హషిమోటో చెప్పారు. జపాన్ ప్రధాని యోషిహిడె సుగా కూడా ఈ నాటకం చాలా దారుణమని అన్నారు. ఆ తర్వాత ఒక ప్రకటనలో కొబయాషి కూడా క్షమాపణ చెప్పారు.