India Vs New Zealand | అహ్మదాబాద్: ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన జోష్‌లో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో భారత అమ్మాయిల మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం తొలి వన్డే జరుగనుంది. వచ్చే ఏడాది సొంతగడ్డపైనే జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఈ సిరీస్ నుంచే భారత్ సన్నాహకాలను మొదలుపెట్టనుంది.
మార్చిలో షూటింగ్ లీగ్
ఢిల్లీ: దేశంలో ప్రజాదరణ పొందుతున్న పలు క్రీడాంశాల ఫ్రాంచైజీ లీగ్‌ల జాబితాలో మరో క్రీడ చేరనున్నది. వచ్చే ఏడాది మార్చి నుంచి దేశంలో షూటింగ్ లీగ్ ఆఫ్ ఇండియా (ఎస్ఎల్ఐ)ను ప్రారంభించనున్నట్టు జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) తెలిపింది. ఈ మేరకు తమ ప్రతిపాదనలకు గవర్నింగ్ బాడీ ఆమోదముద్ర వేసినట్టు ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు కలికేశ్ నారాయణ్‌సింగ్ దేవ్ తెలిపారు.
భారత్‌కు చుక్కెదురు
ఢిల్లీ: ఢిల్లీ వేదికగా జర్మనీతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే పరాభవం ఎదురైంది. పదేండ్ల తర్వాత ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ 0-2తో జర్మనీ చేతిలో ఓడింది. జర్మనీ తరఫున హెన్రిక్ మార్ట్గెన్స్ (4వ నిమిషంలో), సారథి లుకాస్ విండ్‌ఫెడర్ (30వ ని.) రెండు గోల్స్ సాధించి ఆ జట్టును విజయపథంలో నడిపారు.
భారత్ సెమీస్ ప్రత్యర్థి అఫ్గాన్
అల్ అమరత్ (ఒమన్): పురుషుల టీ20 ఎమర్జింగ్ ఆసియా కప్-2024 సెమీస్‌లో యువ భారత్ అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. బుధవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 140/5 పరుగులు చేయగా లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లలోనే దంచేసింది. అయూష్ బదోని (51), కెప్టెన్ తిలక్ వర్మ (36 నాటౌట్) భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.