న్యూఢిల్లీ: స్వదేశం వేదికగా త్వరలో మొదలయ్యే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్‌కు గుడ్‌న్యూస్. డాషింగ్ హిట్టర్ తిలక్‌వర్మకు లైన్‌క్లియర్ అయ్యింది. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన ఈ హైదరాబాదీ బ్యాటర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) నుంచి గ్రీన్‌సిగ్నల్ అందుకున్న తిలక్ త్వరలో టీమ్ఇండియాతో చేరనున్నాడు. మెగాటోర్నీకి ముందు జరిగే వామప్ మ్యాచ్‌ల్లో తిలక్ బరిలోకి దిగనున్నాడు. టీమ్ఇండియా తమ తొలి మ్యాచ్‌లో ఈనెల 7న అమెరికాతో తలపడుతుంది.
కమిన్స్ ఔట్
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ మెగాటోర్నీకి దూరమయ్యాడు. యాషెస్ సిరీస్ సందర్భంగా గాయపడ్డ కమిన్స్ పూర్తిగా కోలుకోలేదు. దీంతో కమిన్స్ స్థానంలో యువ బౌలర్ బెన్ డ్వారిషస్కు 15 మందితో కూడిన జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అవకాశం కల్పించింది. కమిన్స్‌కు తోడు టాపార్డర్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. షార్ట్‌కు బదులుగా మాథ్యూ రెన్షాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. శ్రీలంకలో తమ ప్రపంచకప్ ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్న ఆసీస్‌కు మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.