Tilak Varma : ఆసియా కప్ ఫైనల్లో గెలుపొందిన భారత జట్టుకు ఇప్పటికీ ట్రోఫీ అందలేదు. రెండు నెలలు కావొస్తున్నా ఆసియా క్రికెట్ మండలి చీఫ్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) వ్యవహారంతో ట్రోఫీ దుబాయ్‌లోనే ఉండిపోయింది. భారత క్రికెటర్లలో ఎవరో ఒకరు వస్తే.. తాను ఆసియా కప్‌ను ఇస్తానని నఖ్వీ అంటున్నాడు. అయితే.. అందుకు బీసీసీఐ (BCCI) సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో ఫైనల్లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ (Tilak Varma) మ్యాచ్ అనంతరం ఏం జరిగిందో వివరించాడు. ట్రోఫీ కోసం జట్టు సభ్యులంతా గంటకుపైనే ఎదురుచూశామని, అయినా తమకు ట్రోఫీ ఇవ్వలేదని తిలక్ వెల్లడించాడు.
ఆసియా కప్ ఫైనల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్న తిలక్ వర్మ తాజాగా ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ (Breakfast With Champions) అనే టీవీ షోలో మాట్లాడాడు. మూడేళ్ల క్రితం నాటి రాబ్డోమయోలిసిస్ సమస్య నుంచి బయటపడిన తీరుతో పాటు ఆసియా కప్ ఫైనల్ గురించి మాట్లాడాడు. తొమ్మిదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకుంది. యావత్ క్రీడాలోకాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన నవంబర్ 28 రోజు గురించి మరింత సమాచారాన్ని సందర్భంగా వెల్లడించాడీ హిట్టర్. తర్వాత ఏం జరిగిందో కూడా వెల్లడించాడు.
Tilak Varma scored a fantastic unbeaten fifty in the chase to power #TeamIndia to a title triumph 🏆 & bagged the Player of the Match award 👏👏
Scorecard ▶️ https://t.co/0VXKuKPkE2#AsiaCup2025 | #Final pic.twitter.com/17XSNuABmN
— BCCI (@BCCI) September 28, 2025
‘మ్యాచ్ పూర్తయ్యాక ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, విజేతలకు ఇచ్చే అవార్డులు అందుకోవద్దని నిర్ణయించుకున్నాం. ఇదే విషయాన్ని మేనేజ్మెంట్కు తెలియజేశాం. దాంతో, నఖ్వీతో వారు చర్చిస్తున్నారు. ఆ సమయంలో సభ్యులం మైదానంలో ట్రోఫీ కోసం గంటసేపు ఎదురుచూశాం. మీరు టీవీలో చూసే ఉంటారు. నేను.. మరికొందరం గ్రౌండ్‌మీద నడుంవాల్చి మాట్లాడుకుంటున్నాం. అర్ష్‌దీప్ ఇన్‌స్టా రీల్స్ తీస్తూ సందడి చేశాడు. ఏ క్షణంలోనైనా ట్రోఫీ తీసుకునేందుకు రావాలి అనే పిలుపు వస్తుందని అందరం అనుకున్నాం. కానీ, గంట దాటినా ట్రోఫీ మాకు ఇవ్వలేదు. ‘ఏమైందబ్బా’ అని మైదానం అంతా చూశాం. అప్పటికి ట్రోఫీ అక్కడ లేదు. మనం ఛాంపియన్లం కాబట్టి కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుందామని అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) అన్నాడు. అందుకు.. నేను, అభిషేక్ శర్మ.. మరికొందరం ఓకే చెప్పాం. ఇదే విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్‌కు చెబితే అతడూ సరేనన్నాడు. దాంతో.. ట్రోఫీ లేకున్నా ఉన్నట్టు భావించి సెలబ్రేట్ చేసుకున్నాం’ అని అని తిలక్ వివరించాడు.
Tilak Varma Revealed After His First IPL in 2022 How He was Diagnosed With Rhabdomyolysis. How Akash Ambani & BCCI Helped Him. Few Hour Here n There Ded Stage! Later on He Cameback in IPL Played One Of The Magnificent Knock Against RCB in IPL 2023. An Insane Story Man 🫡. [ BWC ] pic.twitter.com/HE4crZD4Nt
— яιşнí. (@BellaDon_3z) October 23, 2025
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌ను భారత్ అజేయంగా ముగించింది. లీగ్ దశలో, సూపర్ -4లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఫైనల్లోనూ దాయాదిని మట్టికరిపించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల ఛేదనలో 20 పరుగులకే మూడు వికెట్లు పడినా తిలక్ వర్మ (69 నాటౌట్) చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. సంజూ శాంసన్(24, శివం దూబే(33)ల సహకారంతో పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తిలక్.. డెత్ ఓవర్లలో తన క్లాస్ బ్యాటింగ్‌తో అలరించాడు. హ్యారిస్ రవుఫ్ వేసిన 19వ ఓవర్లో కళ్లు చెదిరే సిక్సర్ బాది టీమిండియాను విజయానికి చేరువ చేశాడీ చిచ్చరపిడుగు. రింకూ సింగ్ ఫోర్ కొట్టడంతో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన భారత్.. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది.
Tilak Verma – “When 3 wickets were down Pakistani players were crossing limits but I stayed calm and ensured victory for my country.”
– SUCH AN ALPHA MENTALITY AT SUCH A YOUNG AGE 🤍🧿!!
pic.twitter.com/M2BR4fTXJF— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) September 30, 2025