IPL 2023 | తిలక్ వర్మ 84 నాటౌట్.. ఆర్సీబీ టార్గెట్ 172
ఐపీఎల్ ఐదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) 171 పరుగులు చేసింది. యంగ్‌స్టర్ తిలక్ వర్మ(84) అర్ధ శతకంతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (15), నేహల్ వధీర (21) అతడికి సహకారం అందించారు.
IPL 2023 : ఐపీఎల్ ఐదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) 171 పరుగులు చేసింది. ఆర్సీబీ(RCB) బౌలర్ల ధాటికి ప్రధాన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. యంగ్‌స్టర్ తిలక్ వర్మ(84) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (15), నేహల్ వధీర (21) అతడికి సహకారం అందించారు. తిలక్ వర్మ చివరిదాకా నిలబడడంతో ముంబై పోరాడగలిగే స్కోర్ చేసింది.
20వ ఓవర్ తొలి బంతిని అర్షద్ ఖాన్(1) స్టాండ్స్‌లోకి పంపాడు. తిలక్ వర్మ(73) నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత నోబ్. ఆఖరి బంతికి సిక్సర్. దాంతో ఆ ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ 8వ వికెట్‌కు 48 రన్స్ రాబట్టారు. ఆర్సీబీ బౌలర్లలో కరన్ శర్మ రెండు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్, సిరాజ్, టోప్లే, బ్రేస్‌వెల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
తిలక్ ధనాధన్ బ్యాటింగ్
టాస్ ఓడిపోయిన ముంబై స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ (10), రోహిత్ శర్మ (1), కామెరూన్ గ్రీన్(5) విఫలమయ్యారు. అయితే.. తిలక్ వర్మ ముంబై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. సూర్యకుమార్ యాదవ్ (15), నేహల్ వధీర (21)తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఐదో వికెట్‌కు వధీర, అతడు 50 రన్స్ జోడించారు. 32 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్స్‌లతో అతను అర్ధ శతకం చేశాడు. ఆర్సీబీ స్టార్ పేసర్ సిరాజ్ 19వ ఓవర్లో వరుసగా నాలుగు వైడ్స్ వేశాడు . దాంతో ఆ ఓవర్లో 16 రన్స్ వచ్చాయి.
.@TilakV9 led @mipaltan‘s recovery with a scintillating 84* off 46 when the going got tough and he becomes our 🔝 performer from the first innings of the #RCBvMI clash in the #TATAIPL 👌👌
A look at his batting summary 🔽 pic.twitter.com/zKxYJSOdgg
— IndianPremierLeague (@IPL) April 2, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

