Redmi Note 13R | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ తన రెడ్మీ నోట్ 13ఆర్ ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. 6.79 అంగుళాల డిస్ ప్లేతో వస్తున్న ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. మూడు రంగులు, ఐదు ర్యామ్ అండ్ స్టోరేజీ వేరియంట్లలో వస్తోంది. డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ తోపాటు వస్తున్న ఈ ఫోన్.. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది. భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
రెడ్మీ నోట్ 13ఆర్ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.16 వేలు (1399 చైనా యువాన్లు), 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.19 వేలు (1599 చైనా యువాన్లు), 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.21 వేలు (1799 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23 వేలు (1999 చైనా యువాన్లు), టాప్ ఎండ్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.25 వేలు (2199 చైనా యువాన్లు) పలుకుతుంది. క్రిస్టల్ సిల్వర్, లైట్ సీ బ్లూ, మిడ్ నైట్ డార్క్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
రెడ్మీ నోట్ 13ఆర్ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.79 అంగుళాల (1080×2460 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
రెడ్మీ నోట్ 13ఆర్ ఫోన్ బ్లూటూత్, గ్లోనాస్, గెలిలియో, జీపీఎస్ లేదా ఏజీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉంటది. ఆంబియెంట్ లైట్ సెన్సర్, యాక్సిలరేటెడ్ సెన్సర్, ఈ-కంపాస్, డిస్టెన్స్ సెన్సర్, వర్చువల్ గైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తోపాటు బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.