IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) టాపార్డర్ బ్యాటర్లు తొలిసారి చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఎడాపెడా ఉతికేశారు. ఓపెనర్ రియాన్ రికెల్టన్(41) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(40) తనదైన షాట్లతో అలరించాడు. వీళ్లిద్దరూ వెనువెంటనే ఔటయ్యాక తిలక్ వర్మ(59) విధ్వంసం మొదలైంది. నమన్ ధిర్(34)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్.. జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 20వ ఓవర్లో 11 రన్స్ రావడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఈ ఎడిషన్‌లో అజేయంగా దూసుకెళ్తున్న ఢిల్లీ ఐదో విక్టరీ సాధిస్తుందా? లేదంటే బుమ్రా సారథ్యంలోని పేస్ దళానికి దాసోహం అవుతుందా? అనేది మరికాసేపట్లో తెలియనుంది.
ఢిల్లీ అడ్డాలో ముంబైకి ఓపెనర్లు అదిరే ఆరంభమిచ్చారు మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో రియాన్ రికెల్టన్(41) రెండు బౌండరీలతో తన ఉద్దేశాన్ని చాటాడు. ఇక స్టార్క్ వేసిన 3వ ఓవర్లో రెచ్చిపోయిన రోహిత్ శర్మ(18) వరుసగా, 4, 6 బాది.. ఆఖరి బంతిని ఎక్స్ట్రా కవర్స్‌లో బౌండరీకి తరలించి 19 రన్స్ పిండుకున్నాడు. ఆ తర్వాత ముకేశ్ 6 రన్స్ ఇవ్వగా.. విప్రజ్ నిగమ్ వేసిన 5వ ఓవర్లో రెండు రన్స్ ఇచ్చి హిట్‌మ్యాన్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. 47వద్ద తొలి వికెట్ పడిన ముంబై మరో 28 పరుగుల తర్వాత కాసేపటికే రియాన్ వికెట్ కోల్పోయింది. గూగ్లీతో కుల్దీప్ యాదవ్ అతడిని బౌల్డ్ చేశాడు.
Read him if you can 🕸 \|/
Kuldeep Yadav beats Ryan Rickelton’s defense with a superb delivery 🤌
Updates ▶ https://t.co/sp4ar866UD#TATAIPL | #DCvMI | @DelhiCapitals | @imkuldeep18 pic.twitter.com/uh6wCoXLwA
— IndianPremierLeague (@IPL) April 13, 2025
ఓపెనర్లు స్వల్ప స్కోర్‌కే డగౌట్ చేరినా సూర్యకుమార్ యాదవ్(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ(59)తో కలిసి 50 ప్లస్ రన్స్ జోడించాడు. అయితే.. సూర్యను కుల్దీప్ ఔట్ చేసిన కాసేపటికే హార్దిక్ పాండ్యా(2)ను విప్రజ్ పెవిలియన్ పంపాడు. దాంతో, ముంబై భారీ స్కోర్‌కు అడ్డుకట్ట పడింది అనుకున్న దశలో.., నమన్ ధిర్(38 నాటౌట్), తిలక్‌లు ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. స్టార్క్ వేసిన 18వ ఓవర్లో నమన్ మూడు బౌండరీలతో 13 రన్స్ పిండుకున్నాడు. 20వ ఓవర్లో బంతిని స్టాండ్స్‌లోకి పంపాలనుకున్న తిలక్.. బౌండరీ వద్ద పొరెల్ చేతికి దొరికాడు. దాంతో, ముంబై అజేయంగా దూసుకెళ్తున్న ఢిల్లీకి 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Innings break!
Tilak Varma’s superb 5⃣9⃣ and Naman Dhir’s quickfire cameo power #MI past the 200-run mark 💪
2⃣ points loading for? 🤔
Updates ▶ https://t.co/sp4ar866UD#TATAIPL | #DCvMI | @mipaltan pic.twitter.com/t7uzca8Cja
— IndianPremierLeague (@IPL) April 13, 2025