IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఆర్పీ సిసోడియాను చేనేత, జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఐటీశాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేనికి ఏపీ హెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా ముత్యాలరాజును నియమించింది. రైతు బజార్ల సీఈవోగా కే మాధవీలత, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని నియమించింది. ఆయుష్ డైరెక్టర్‌గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.