SSMB 29 | గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకదిగ్గజాల్లో టాప్‌లో ఉంటాడు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ దర్శకుడి కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు గ్లోబల్ రికార్డ్స్ బద్దలు గురించే ఇండస్ట్రీతోపాటు నెట్టింట అంతా చర్చ నడుస్తుంది. కాగా ఇప్పుడు జక్కన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29పైనే తన ఫోకస్ అంతా పెట్టాడని మూవీ లవర్స్‌కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈమూవీ షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయమొకటి నెట్టింట వైరల్ అవుతోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌ను టీంలోకి తీసుకువస్తున్నాడట జక్కన్న. ఇంతకీ ఆ డైరెక్టరెవరనే కదా మీ డౌటు. ప్రస్థానం సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దేవాకట్టా (Deva Katta).
తాజా టాక్ ప్రకారం ఎస్ఎస్ఎంబీ 29కి దేవా కట్టా డైలాగ్ రైటర్‌గా పనిచేయబోతున్నాడట. దేవాకట్టా ఇప్పటికే జక్కన్న డైరెక్ట్ చేసిన బాహుబలి చిత్రానికి పలు సంభాషణలు అందించాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం సాయి మాధవ్ బుర్రాను తీసుకున్న జక్కన్న.. ఈ సారి మహేశ్ బాబు సినిమా కోసం మళ్లీ దేవాకట్టాను రిపీట్ చేస్తూ సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తున్నాడు.
దేవాకట్టా సినిమాలంటే డైలాగ్స్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. మరి ఇదే నిజమైతే మహేశ్ బాబు-జక్కన్న ప్రాజెక్ట్ కోసం ఎలాంటి డైలాగ్స్ అందించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై జక్కన్న టీం నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Hebah patel | చేసింది 16 సినిమాలు.. హిట్ అయినవి రెండే.. సోషల్ మీడియాలో మాత్రం..