Hit 3 | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి హిట్ ప్రాంఛైజీ హిట్ 3 (HIT: The 3rd Case). శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ప్రాంఛైజీలో వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంఛ్ అప్డేట్ అందించారు. ఈ మూవీ ట్రైలర్‌ను వైజాగ్‌లో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు.
రేపు (ఏప్రిల్ 14న) సంగం థియేటర్లో ఉదయం 10: 30 గంటలకు ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈవెంట్‌కు హాజరు కాలేని వారి కోసం ట్రైలర్‌ను 11:07 గంటలకు ఆన్లైన్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన రషెస్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. హిట్ 3 కోసం అర్జున్ సర్కార్ డ్యూటీలో చేరిపోయాడు.. అంటూ మేకర్స్ ఇప్పటికే నాని పాత్రపై స్నీక్ పీక్ అందిస్తూ షేర్ చేసిన గ్లింప్స్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
HIT 3 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి సందడి చేయనుంది. నాని హోం బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని సిగార్ తాగుతూ, రక్తపు చేతులతో కారు నడుపుతూ, మరోవైపు గొడ్డలితో స్టైలిష్‌గా కనిపిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Vizag!
Welcome SARKAAR & his MADNESS 💥#HIT3 Trailer Launch event at Sangam Theatre, Vizag on April 14th from 10.30 AM onwards ❤🔥#HIT3Trailer out tomorrow at 11.07 AM.#HIT3 in cinemas worldwide on 1st MAY, 2025.#AbkiBaarArjunSarkaar
Natural Star @NameisNani… pic.twitter.com/rWYbantOyy— Wall Poster Cinema (@walpostercinema) April 13, 2025
Sadha | హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ పెట్టిన సదా.. ఓదారుస్తున్న నెటిజన్స్
Hebah patel | చేసింది 16 సినిమాలు.. హిట్ అయినవి రెండే.. సోషల్ మీడియాలో మాత్రం..