Sadha | తెలుగు ప్రేక్షకులకి సదా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జయం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా.. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లు.. అంటూ అప్పట్లో కుర్రకారు మనసులు దోచుకుంది. ఈ చిత్రంలో సదా నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సదాకి అవకాశాల మీద అవకాశాలు రావడం అవన్ని హిట్స్ కావడం జరిగింది. చాలా కాలం పాటు సదా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. డ్యాన్స్ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తూ అందరినీ ఎంటర్ టైన్ చేసింది. ఇప్పటికీ సదా సింగిల్‌గానే ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఓ పెట్ని తన సొంత ప్రాణంగా చూసుకుంటుంది.
ఇప్పుడు ఆ పెట్ డాగ్ లైలా మరణించడంతో చాలా ఎమోషనల్‌గా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తన పెట్‌పై పూలు ఉంచి ఆర్ఐపీ లైలా అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌ని బట్టి చూస్తుంటే సదా ఎంత బాధపడుతుందో అర్ధమవుతుంది. నెటిజన్స్ సదాకి ధైర్యం చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం రష్మీ పెట్ డాగ్ కూడా ఇలానే చనిపోతే ఆమె కూడా చాలా ఎమోషనల్‌గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇక సదా విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సదా ఎందుకో ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. పెళ్లి గురించి ఓ సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. ఒక ఏజ్ వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవడం కాదు. సొసైటీ మనమీద ప్రెజర్ పెడుతుందని చేసుకోవద్దు. మీకు అనిపిస్తే, మీకు కరెక్ట్ పర్సన్ దొరికాడు అనుకుంటే పెళ్లి చేసుకోండి. లైఫ్ ఒకసారి స్టార్ట్ అయ్యాక ఒకవేళ కంటిన్యూ అంటుంటే, కష్టాలు వస్తే, బతకలేం అనుకుంటే విడిపోవడంలో తప్పులేదు అని కూడా అనిపిస్తుంది. నేనేమి పెళ్లికి వ్యతిరేకం కాదు. ఎవరికి ఎలా సూట్ అవుతుందో అది చేయొచ్చు అంటున్నాను అంతే. తెలియని వ్యక్తితో రూఫ్ షేర్ చేసుకోవడం అనేది నాకు భయం. కొంతమందికి అది ఓకే కాని, నా విషయంలో మాత్రం అది కాస్త కష్టం అని సదా పేర్కొంది.