IPL 2025 : ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ(18) జోరుకు తెరపడింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో 19 పరుగులు పిండుకున్న హిట్‌మ్యాన్‌ను విప్రజ్ నిగమ్(Vipraj Nigam) ఎల్బీగా వెనక్కి పంపాడు. రివ్యూ తీసుకొని మరీ వికెట్ సాధించింది. దాంతో, 47 వద్ద ముంబై జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(6) ముకేశ్ వేసిన 6వ ఓవర్లో తన స్టయిల్లో లెగ్ సైడ్ సిక్సర్ బాదాడు. ఓపెనర్ రియాన్ రికెల్టన్ 33 పరుగులతో ఆడుతున్నాడు. పవర్ ప్లేలో ముంబై స్కోర్.. 59-1.
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో రియాన్ రికెల్టన్(33) రెండు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. ఆ తర్వాత ముకేశ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టాడు. స్టార్క్ వేసిన 3వ ఓవర్లో రెచ్చిపోయిన రోహిత్ శర్మ(18) వరుసగా, 4, 6 బాది.. ఆఖరి బంతిని ఎక్స్ట్రా కవర్స్‌లో బౌండరీకి తరలించి 19 రన్స్ పిండుకున్నాడు. ఆ తర్వాత ముకేశ్ 6 రన్స్ ఇవ్వగా.. విప్రజ్ నిగమ్ వేసిన 5వ ఓవర్లో రెండు రన్స్ ఇచ్చి హిట్‌మ్యాన్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు.
Rapid and Ruthless 🔥
Clean strikes and crisp timing from Ryan Rickelton & Rohit Sharma power #MI‘s strong opening 👊
They are 39/0 after 3 overs.
Updates ▶ https://t.co/sp4ar866UD#TATAIPL | #DCvMI | @mipaltan pic.twitter.com/alRve7kdI7
— IndianPremierLeague (@IPL) April 13, 2025