Emerging Asia Cup : చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ అంటే చాలు.. భారత ఆటగాళ్లు కసిదీరా ఆడుతారు. అది క్రికెట్ అయినా.. హాకీ అయినా .. ఖోఖో.. ఏ పోటీ అయినా సరే పాక్‌తో మ్యాచ్ అంటే మనోళ్లకు పూనకాలే. సీనియర్లకు తామేమీ తక్కువ కాదంటూ ఒమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ (Emerging Asia Cup 2024)లో భారత ఏ జట్టు కుర్రాళ్తు చితక్కొట్టారు. పాకిస్థాన్ ఏ బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు కొండంత స్కోర్ అందించారు. కెప్టెన్ తిలక్ వర్మ(44), ప్రభ్సిమ్రాన్ సింగ్(36)లు బౌండరీలతో చెలరేగారు. ఆఖర్లో రమన్‌దీప్ సింగ్(17 నాటౌట్) మెరుపులతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 183 పరుగులు చేసింది.
టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ తొలి పోరులో భారత కుర్ర జట్టు దంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ(35), ప్రభ్సిమ్రాన్ సింగ్(36)లు అదిరే ఆరంభమిచ్చారు. తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఈ జోడీని విడదీసిన సూఫియన్ మకీమ్ పాక్‌కు బ్రేకిచ్చాడు. అయితే.. వికెట్ తీసిన సంతోషం పాక్ జట్టుకు లేకుండా చేశాడు కెప్టెన్ తిలక్ వర్మ(44).
India ‘A’ scored 1️⃣8️⃣3️⃣ runs against Pakistan ‘A’, with the top order leading the charge. Can their bowlers defend the total and seal the game?#MensT20EmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/9ZwaROwwYN
— AsianCricketCouncil (@ACCMedia1) October 19, 2024
ఓపెనర్ ప్రభ్సిమ్రాన్తో కలిసి దూకుడుగా ఆడిన తిలక్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మహ్మద్ ఇమ్రాన్ వేసిన 18వ ఓవర్లో రెచ్చిపోయిన తిలక్ లాంగాన్‌లో భారీ సిక్సర్ బాదగా.. రమన్‌దీప్ సింగ్(17 నాటౌట్) వరుసగా 4, 6, కొట్టాడు. దాంతో, స్కోర్ 150 దాటింది. ధాటిగా ఆడేక్రమంలో తిలక్, నేహల్ వధేరా(24)లు త్వరగా ఔట్ అయ్యారు. ఆఖరి బంతికి రసిక్ దార్ సలాం(6 నాటౌట్) సిక్సర్ కొట్టగా టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 రన్స్ కొట్టింది.