అమరావతి : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి (Mudragada Kranti ) జనసేనలో చేరారు. శనివారం జనసేన (Janasena) ప్రధాన కార్యలయంలో అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఆమెతో పాటు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, జగ్గయ్యపేటకు చెందిన నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులకు అభినందనలు తెలిపారు. జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని మరింత పెంచాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చటం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.