ఢిల్లీ : వచ్చే నెల 24 నుంచి మే 3 దాకా డెన్మార్క్‌లో జరుగబోయే ప్రతిష్టాత్మక థామస్ (పురుషుల), ఊబర్ (మహిళల) కప్‌లో భారత జట్లకు కఠినమైన డ్రా పడింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం విడుదల చేసిన డ్రాలో థామస్ కప్‌నకు గాను భారత జట్టు.. డిఫెండింగ్ చాంపియన్ చైనాతో పాటు కెనడా, ఆస్ట్రేలియాతో గ్రూప్-ఏలో ఉంది.
ఇక ఊబర్ కప్‌లోనూ 16 సార్లు చాంపియన్ చైనాతో పాటు డెన్మార్క్, ఉక్రెయిన్‌తో గ్రూప్-ఏలో నిలిచింది. నిరుటి ఎడిషన్‌లో భారత అమ్మాయిలు.. జపాన్ చేతి ఓడి క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు.