Wimbledon : వింబుల్డన్ రెండో రోజు కూడా సంచలనాల పర్వం కొనసాగుతోంది. తొలిరోజు ఫేవరెట్లు డానిల్ మెద్వెదేవ్, స్టెఫానో సిట్సిపాస్‌లు తమకంటే తక్కువ ర్యాంక్ ఆటగాళ్ల చేతిలో ఓటమితో నిష్క్రమించగా.. మూడో సీజ్ జెస్సికా పెగులా (Jessica Pegula) సైతం ఇంటిదారి పట్టింది. మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరెట్లలో ఒకరైన ఆమెకు 116వ ర్యాంకర్ ఎలిజబెత్ కొస్కియరెట్టొ షాకిచ్చింది. దాంతో, ఐదేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న పెగులా ఇలా తొలి రౌండ్లోనే వెనుదిరగడం ఇదే ప్రథమం. ఆమె చివరగా 2020 ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండో రౌండ్ చేరలేకపోయింది.
ఈ ఏడాది ఐదు సింగిల్స్ ఫైనల్స్ ఆడిన జెస్సికా పెగులా మధ్యే ఆల్ ఇంగల్డ్ క్లబ్ ఈవెంట్లో ఇగా స్వియాటెక్‌ను చిత్తు చేసింది. ఆమె ఫామ్‌ను చూస్తే.. వింబుల్డన్‌లో దూసుకెళ్లడం ఖాయం అనుకున్నారంతా. అలవోకగా రెండో రౌండ్‌కు వెళ్తుందనుకుంటే తను అనూహ్యగా పరాజయం పాలైంది. అది కూడా తనకంటే 50 రెట్లు తక్కువ ర్యాంకర్ చేతిలో ఈ అమెరికా భామ కంగుతిన్నది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో పెగులాకు ముచ్చెమటలు పట్టించింది ఎలిజబెత్. టాప్ సీడ్‌పై ఆధిపత్యం చెలాయించిన తను తొలి సెట్‌ను 6-2తో సునాయసంగా గెలుపొందింది.
It’s been some journey for Elisabetta Cocciaretto ♥️
After missing out on playing at #Wimbledon last year, the Italian was delighted to progress to the second round in SW19 👏 pic.twitter.com/FicmDhlFyI
— Wimbledon (@Wimbledon) July 1, 2025
రెండో సెట్లోనూ అదే జోరు చూపించిన ఇటలీ సంచలనం 6-3తో పెగులాకు దిమ్మతిరిగే షాకిచ్చింది. 24 పొరపాట్లు చేసిన పెగులా చేజేతులా ఓటమి పాలైంది. ‘పెగులాతో మ్యాచ్ అనగానే టెన్షన్ పడలేదు. ఏమైనా సరే దూకుడుగా ఆడాలని అనుకున్నా. ఓడినా, గెలిచినా పర్లేదు అనే ఆలోచనతో బరిలోకి దిగాను. ఛాంపియన్ ప్లేయర్‌పై నేను నిజంగా చాలా గొప్పగా ప్రదర్శన చేశాను. తను అద్బుతమైన క్రీడాకారిణి. మాలాంటి యువతక ఆమె ఆదర్శం’ అని మ్యాచ్ అనంతరం తెలిపింది 24 ఏళ్ల ఎలిజబెత్.