తిమ్మాజిపేట, జులై 01 : తిమ్మాజీపేట మండల కేంద్రంలో టీజీఎస్ బీసీఎల్ ( మద్యం డిపో) లో హమాలీలుగా అవకాశం కల్పించాలని కోరుతూ మంగళవారం స్థానిక యువకులు స్టాక్ పాయింట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఉపాధి కోసం అనేక సంవత్సరాలుగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2008-09 సంవత్సరంలో మూడు నెలల పాటు ధర్నా చేసినట్లు యువకులు తెలిపారు. నిరుద్యోగ యువకులకు హమాలీలుగా అవకాశం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించగా, 15 మందికి అవకాశం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలోని అన్ని స్టాక్ పాయింట్లు హమాలీలుగా పెట్టుకునే అధికారం లిక్కర్ అండ్ బీర్ అసోసియేషన్ ఇచ్చినట్టు వారు తెలిపారు.
స్టాక్ పాయింట్లో ప్రస్తుతం పని చేస్తున్న హమాలీలు కూడా 15 మందిని చేర్చుకునే విషయంలో సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు టీజీ బీసీఎల్ ఉన్నతాధికారులకు లేక ఇచ్చామని, అయినా హమాలీలుగా అవకాశం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఉపాధి లేక నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడుతున్నందున అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం స్థానిక డిపో మేనేజర్ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాములు, కురుమయ్య, కృష్ణయ్య, భాష పాల్గొన్నారు.
Thimmajipeta : హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని టీజీ బీసీఎల్ వద్ద యువకుల ఆందోళన