Doctors Day | డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్లు.. వారి పరిరక్షణ బాధ్యత ప్రజలదే : డాక్టర్స్ డేలో సుమన్ మోహన్ రావు
Doctors Day | మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ, ఆర్ఎంపి, పీఎంపీ శాఖల ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Doctors Day | జగిత్యాల, జులై 1 : వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని, ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ మోహన్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ, ఆర్ఎంపి, పీఎంపీ శాఖల ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న మాతా శిశు కేంద్ర, మెడికల్ కాలేజీ, ఐఎంఏ అసోసియేషన్ డాక్టర్లను సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ఆర్ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజా గోపాల్ చారిలు ఘనంగా సన్మానించారు. మాతా శిశు సూపరింటెండెంట్ సుమన్ మోహన్ రావు, ఆర్ఎంవోలు డాక్టర్లు గీతిక, శ్రీపతి, విజయా రెడ్డి, నరేష్, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీల్, ప్రొఫెసర్లు రఘు, ప్రవీణ్, అర్చన, శిల్ప, ప్రదీప్, స్రవంతి, సింధూజలను, ఐఎంఏ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి.హేమంత్, ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ట్రెజరర్ సుధీర్, దంత వైద్యుడు డాక్టర్ హరి విక్రమ్‌లను పట్టు శాలువాలతో, విశిష్ట సేవా పురస్కారాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్లని, తెలంగాణను ఆరోగ్య తెలంగాణ మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం హర్షణీయమన్నారు. మాతా శిశు కేంద్రం, ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ఐఎంఎ ఆధ్వర్యంలో డాక్టర్లు అందిస్తున్న సేవలను కొనియాడారు.
జగిత్యాల జిల్లా మెడికల్ హబ్‌గా మారడంతో జిల్లా ప్రజలకి ప్రభుత్వం తరపున ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు, 60 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నారని డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజేన్స్ ఉపాధ్యక్షుడు పి హన్మంత రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కే సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్, మాతా శిశు కేంద్ర, డాక్టర్లు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది, సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also :
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!
Dhanush | మమ్ముట్టిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.. మెగాస్టార్‌పై ధనుష్ ప్రశంసలు!
Dear Astronaut | అంతరిక్షయాన కల నెరవేర్చేందుకు తండ్రి సాహసం.. ఆకట్టుకుంటున్న ‘డియర్ ఆస్ట్రోనాట్’ ట్రైలర్
Health tips | మీ డైట్లో బీట్రూట్ ఉంటే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
Panchayat elections | ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు కొనసాగుతున్న నామినేషన్లు
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

