గురువారం 21 జనవరి 2021
Sports - Dec 21, 2020 , 01:10:21

చాంపియన్‌ యార్కర్‌ లయన్స్‌

చాంపియన్‌ యార్కర్‌ లయన్స్‌

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: తెలంగాణ కార్పొరేట్‌ ప్రీమియర్‌ లీగ్‌ మూడో సీజన్‌లో యార్కర్‌ లయన్స్‌ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఎలైట్‌ టైగర్స్‌తో జరిగిన తుది పోరులో యార్కర్‌ లయన్స్‌ 55 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన యార్కర్‌ లయన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యఛేదనలో ఎలైట్‌ టైగర్స్‌ జట్టు 17.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌ అనంతరం సాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి విజేతలకు ట్రోఫీ అందజేశారు. logo