ఢిల్లీ: భారత్‌తో రెండు టెస్టులు ఆడేందుకు వచ్చిన వెస్టిండీస్‌కు సిరీస్ ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ షమర్ జోసెఫ్ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ ఎక్స్ వేదికగా తెలిపింది.
22 ఏండ్ల ఈ బార్బడోస్ ఆల్‌రౌండర్.. 11 మ్యాచ్‌లలో 51 వికెట్లు పడగొట్టాడు. గాయపడిన జోసెఫ్ స్థానాన్ని జొహన్ లేన్ భర్తీ చేయనున్నాడు.