Rishabh Pant | నువ్విలా ఆడితే జట్టులో చోటు కష్టమే.. పంత్ ను హెచ్చరించిన సీనియర్లు
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ల గైర్హాజరీలో భారత జట్టు పగ్గాలు చేపట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురౌతున్నాడు. అయితే అతడు ఇలాగే ఆడితే జట్టులో చోటు కోల్పోవడం కూడా ఖాయమని..పంత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలామంది ఆటగాళ్లు రెడీగా ఉన్నారని అంటున్నారు భారత మాజీ సీనియర్లు. ఇప్పటికైనా ముప్పును గ్రహించి ఆడాలని అతడిని హెచ్చరిస్తున్నారు.
ఇదే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్లు వసీం జాఫర్, ఆకాశ్ చోప్రాలు స్పందించారు. చోప్రా మాట్లాడుతూ.. ‘రిషభ్ ఫామ్ టీమిండియాకు పెద్ద సవాల్ గా మారింది. దక్షిణాఫ్రికా సిరీస్ లో గత 3 మ్యాచుల్లో కలిపి అతడు 40 (29, 5, 6) పరుగులు మాత్రమే చేశాడు. అతడు ఇలాగే ఆడితే టీ20లలో కొనసాగించడం అనుమానమే. కెఎల్ రాహుల్ జట్టులోకి తిరిగొస్తే పంత్ కు చోటు కష్టమే’ అని అన్నాడు.
ఇక జాఫర్ స్పందిస్తూ.. ‘టీమిండియాకు కెఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపర్ ఉన్నాడు. అతడు గాయం నుంచి కోలుకుని వస్తే వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా మోయగలడు. రాహుల్ తో పాటు దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్ రూపంలో కూడా మనకు వికెట్ కీపర్లతో పాటు వేగంగా పరుగులు చేసే ఆటగాళ్లున్నారు..
దీనిని బట్టి చూస్తే.. రిషభ్ ఇలాగే ఆడితే మాత్రం అతడు టీ20 లలో కొనసాగడం సవాల్ తో కూడుకున్నదే.. అతడు నిలకడగా ఆడుతూ పరుగులు సాధించాలి. టెస్టులు, వన్డేలలో పంత్ బ్యాటింగ్ చేసే విధానం బాగుంటుంది. టీ20లలో కూడా దానిని కొనసాగించాలి..’ అని తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

