అహ్మదాబాద్: భారత్తో టెస్టు సిరీస్ ఎదుట పర్యాటక వెస్టిండీస్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదివరకే ఆ జట్టు పేసర్ షమర్ జోసెఫ్ గాయంతో సిరీస్ నుంచి తప్పుకోగా తాజాగా మరో సీమర్ అల్జారీ జోసెఫ్ సైతం గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు.
వెన్నునొప్పితో అల్జారీ సిరీస్కు దూరమయ్యాడని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది. జెడియా బ్లేడ్స్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.