IND vs BAN | చివరి టెస్ట్ టై.. భారత్, బంగ్లా మహిళల వన్డే సిరీస్ సమం..
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే ‘టై’గా ముగిసింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లూ ఒక్కో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ సమమైంది. మొదట బంగ్లా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.
IND vs BAN | మీర్పూర్: భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే ‘టై’గా ముగిసింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లూ ఒక్కో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ సమమైంది. మొదట బంగ్లా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్జానా హక్ (107) సెంచరీతో రాణించగా.. షమీమా సుల్తానా (52) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకుంది. భారత బౌలర్లలో స్నేహ్రాణా 2 వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో సరిగ్గా 225 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (59), హర్లీన్ డియోల్ (77) అర్ధశతకాలు సాధించారు. ఒక దశలో 212/6తో విజయానికి చేరువైన టీమ్ఇండియా.. 19 బంతుల్లో 10 పరుగులు చేయలేక చివరకు మ్యాచ్‌ను ‘టై’గా ముగించింది. జెమీమా రోడ్రిగ్స్ (33 నాటౌట్) క్రీజులో ఉన్నా ఫలితం లేకపోయింది. కాగా.. కెప్టెన్ హర్మన్(14) ఔటైన తీరు వివాదాస్పదమైంది. మ్యాచ్ అనంతరం హర్మన్ స్పందిస్తూ ఈ టూర్లో అంపైరింగ్ తీరు పూర్తిగా నిరాశ పరిచిందని పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

