వడోదర: భారత జట్టు మేనేజ్మెంట్ తనను ఆల్‌రౌండర్‌గా ఎదగాలని కోరుకుంటున్నదని యువ పేసర్ హర్షిత్ రాణా అన్నాడు. మ్యాచ్ ముగిశాక రాణా మాట్లాడుతూ.. ‘జట్టు మేనేజ్మెంట్ నన్ను ఆల్‌రౌండర్‌గా చూడాలనుకుంటున్నది.
ప్రస్తుతం నేను నెట్స్‌లో దానిమీదే పనిచేస్తున్నా. లోయరార్డర్లో నేను 30-40 పరుగులు చేసినా అవి జట్టుకు ఎంతో ఉపయోగకరం’ అని అన్నాడు.