మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 11 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి జూనియర్స్ నెట్‌బాల్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. శనివారం బాలుర ట్రెడీషనల్ విభాగం సెమీస్‌లో మహబూబ్‌నగర్16-11 తేడాతో ఖమ్మం జట్టుపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీస్‌లో నారాయణపేట 18-12 తేడాతో జనగాంపై విజయం సాధించింది.
బాలికల విభాగంలో రంగారెడ్డి 11-06 తేడాతో నిజామాబాద్ జట్టుపై, నల్లగొండ 15-11 తేడాతో మహబూబ్‌నగర్ జట్టుపై నెగ్గాయి. రెండు విభాగాల్లో ఖమ్మం, జనగాం, నిజామాబాద్ జట్లు మూడో స్థానంలో నిలిచాయి. అనంతరం జరిగిన ఫాస్ట్-5 నాకౌట్లో ఆసిఫాబాద్ 22-13 తేడాతో మెదక్‌పై గెలిచింది.