న్యూఢిల్లీ : పాకిస్థాన్‌తో భవిష్యత్‌లో ఎలాంటి దైప్వాక్షిక సిరీస్‌లు ఉండవని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక పరిస్థితులు కొనసాగుతున్న వేళ తటస్థ వేదికల్లోనూ పాక్‌తో ద్వైపాక్షిక క్రీడా టోర్నీలు ఆడేది లేదంటూ కుండబద్దలు కొట్టింది. పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సంబంధాల విషయంలో కొత్త పాలసీని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆసియాకప్‌లో ఆడేందుకు టీమ్ఇండియాకు అనుమతిచ్చింది.
కొత్త పాలసీ ప్రకారం భారత ప్లేయర్లు పాక్‌కు వెళ్లేందుకు, వారు ఇక్కడికి వచ్చేందుకు ఎలాంటి అవకాశం ఉండబోదని క్రీడా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ‘పలు దేశాలు పోటీపడే క్రీడాటోర్నీల్లో పాక్‌కు భారత ప్లేయర్లు వెళ్లాలంటే అప్పుడున్న పరిస్థితులను సమీక్షిస్తాం. ప్లేయర్ల భద్రతకు ప్రాధాన్యమిస్తూ నిర్ణయం తీసుకుంటాం’అని క్రీడాశాఖ అధికారి ఒకరు తెలిపారు. పాలసీకి సంబంధించిన వివరాలను క్రీడాశాఖ తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.