దుబాయ్: న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమి భారత వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ముంబై టెస్టుకు ముందు 62.82 శాతం పాయింట్లతో అగ్రస్థానాన ఉన్న టీమ్ఇండియా.. మ్యాచ్ తర్వాత 58.33 శాతం పాయింట్లతో రెండో స్థానానికి దిగజారింది. 62.50 శాతం పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానానికి ఎగబాకింది.
ఈ సైకిల్ (2023-25)లో భారత్ మరో ఐదు టెస్టులు ఆడనుంది. ఇతర ఫలితాలతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాను 4-0తో ఓడిస్తేనే భారత్ ఫైనల్ చేరుతుంది. ఆసీస్‌ను ఇంత తేడాతో ఓడించడం అత్యంత సవాల్‌తో కూడుకున్నదే. ఫైనల్ రేసులో భారత్‌తో పాటు శ్రీలంక (55.56), న్యూజిలాండ్ (54.55), సౌతాఫ్రికా (54.17) కూడా ఉన్నాయి.