రావల్పిండి: దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య రావల్పిండిలో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. మూడో రోజు దక్షిణాఫ్రికా 404 పరుగుల భారీ స్కోరు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 71 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌లో పైచేయి సాధించింది. లోయరార్డర్లో సెనురన్ ముత్తుస్వామి (155 బంతుల్లో 89 నాటౌట్, 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా చివరి వరుస బ్యాటర్ కగిసొ రబాడా (61 బంతుల్లో 71, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) వన్డే తరహా ఆట ఆడి టెస్టులలో తన తొలి అర్ధశతకాన్ని నమోదుచేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 94/4తో నిలిచింది.