నాగ్పూర్: విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతున్నది. హిమాన్షు మంత్రి(126) సెంచరీ చేసినా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకే పరిమితమైంది. ఓవర్నైట్ స్కోరు 47-1తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ భారీ స్కోరు సాధించలేకపోయింది.
జైన్ (30), సాగర్ సోలంకీ (26), హర్ష్ గ్వాలీ (25) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఉమేశ్ యాదవ్ (3-40), యష్ ఠాకూర్ (3-51), అక్షయ్ (2-68) థాటికి మిగతా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.