Paris | ‘సిటీ ఆఫ్ లవ్’గా పిలుచుకునే పారిస్‌లో ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన పలువురు క్రీడాకారులు ఆటలతో పాటు తమ జీవిత భాగస్వాములనూ కలుసుకున్నారు. ‘ప్రేమ నగరి’లో 8 జంటలు తమ ప్రేమను వ్యక్తపరచడమూ ఒక రికార్డే. ఫ్రాన్స్ అథ్లెట్ అలీస్ ఫినొట్, ఇటలీ జిమ్నాస్ట్ అలీస్సా, బ్రెజిల్ ట్రిపుల్ జంపర్ అల్మిర్, అమెరికా షాట్ పుటర్ పేటన్, అర్జెంటీనా హ్యాండ్‌బాల్ టీమ్ మెంబర్ పాబ్లొ సిమెనెట్, యూఎస్ఏ రోయింగ్ గోల్డ్ మెడల్ విన్నర్ జస్టిన్ బెస్ట్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు యా కియోంగ్, లి యుచెన్.. పారిస్ వేదికగా వెడ్డింగ్ రింగ్‌లు ధరించాయి.