న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు దిగ్గజ ద్వయం రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ.. విజయ్ హజారే టోర్నీలో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో వన్డేలు ముగిసిన వెంటనే స్వదేశం వేదికగా వచ్చే జనవరిలో కివీస్‌తో సిరీస్ జరుగనుంది.
ఈ మధ్యలో విజయ్ హజారే టోర్నీలో ఢిల్లీ, ముంబై జట్లు మ్యాచ్‌లు ఆడనున్నాయి. 2027 ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్నెస్తో ఉండాలంటే కోహ్లీ, రోహిత్..దేశవాళీ టోర్నీలో బరిలోకి దిగాల్సిన అవసరముంది. ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అగర్కార్‌తో పాటు కోచ్ గంభీర్..సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు దేశవాళీ టోర్నీలో ఆడాలని సూచించారు.