తిరువనంతపురం: స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టు నేడు నాలుగో టీ20 ఆడనున్నది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి 3-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.
తిరువనంతపురం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.